![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -215 లో.. మా అమ్మని చూడటానికి వెళ్తున్నానని భవానితో ముకుంద చెప్పగా.. సరేనని అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రేవతికి ముకుంద మీద డౌట్ వస్తుంది.
మురారి, కృష్ణ ఇద్దరు షాపింగ్ కి వెళ్తారు. అక్కడ కృష్ణ కోసం చీరలు తీసుకోమని మురారి చెప్తే.. తను మాత్రం ఇంట్లో అందరికి బట్టలు తీసుకోవాలని మురారితో చెప్పి తీసుకుంటుంది. అయితే ఎలాగైనా కృష్ణకి ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలని మురారి ఒక బంగారు ఉంగరం తీసుకుంటాడు. అయితే కృష్ణని కళ్ళు మూసుకోమని చెప్తాడు మురారి. తను కళ్ళు మూసుకోగానే ఉంగరం తీసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేయాలని మురారి చూస్తుండగా.. అప్పుడే కృష్ణ వాళ్ళ సీనియర్ డాక్టర్ పరిమళ వస్తుంది. దాంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు మురారి. ఆ తర్వాత పరిమళ వాళ్ళిద్దరితో మాట్లాడి వెళ్తుంది. కృష్ణ, మురారి కలిసి చీరలు సెలెక్ట్ చేస్తుంటారు.
అయితే ఎంతకీ ఆ చీరల షాపింగ్ అవ్వకపోయేసరికి విసిగిపోయిన మురారి.. మీరెందుకు చీరల కోసం ఇంత టైం తీసుకుంటారని మురారి అంటాడు. మేం ఏ చీర కొన్నా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉండాలని, వాటికి మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ చెవిపోగులు.. ఇలా అన్నీ ఉండాలని మొత్తం వివరిస్తుంది కృష్ణ. ఆ తర్వాత ఓహో అని మురారి అనుకుంటాడు.
ఆ తర్వాత మురారి, కృష్ణల కోసం ముకుంద కార్ లో వస్తుంటుంది. అది గమనించిన రేవతి.. తన కార్ కి ఎదురుగా వెళ్లి ఆపేస్తుంది. ఎందుకు ముకుంద ఇలా చేస్తున్నావని రేవతి అడుగుతుంది. అది కాదు అత్తయ్య మా అమ్మని చూడటానికి వెళ్తున్నా అని ముకుంద అనగానే.. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసని, నేను పెద్ద అత్తయ్యని కాదని రేవతి అంటుంది. నా కొడుకు కోడలిని వీడదీయాలని ఎందుకు ఇలా చేస్తున్నావని ముకుంద రేవతిని అడుగుతుంది. మీరు నాకు అడ్డురాకండి. ఎందుకంటే నేను భవాని అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. కృష్ణ, మురారీలది అగ్రిమెంట్ మ్యారేజ్ అని, పెళ్లికి ముందు మురారి నన్ను ప్రేమించి మోసం చేశాడని చెప్తానని రేవతితో చెప్తుంది ముకుంద. దాంతో రేవతి అలానే షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |